: మహేశ్వరం బరి నుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి
గ్రేటర్ హైదరాబాదులో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి మహేశ్వరం శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి భాస్కర్ రెడ్డి తప్పుకున్నారు. కాంగ్రెస్ కు నష్టం జరగకుండా చూడాలనే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న వైఎస్సార్సీపీ ఆదరణకు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే, మరికొంత మంది అభ్యర్థులు కూడా పోటీనుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.