: సీపీఐకి సిట్టింగ్ సీటివ్వడం బాధాకరం: రేణుకా చౌదరి
ఖమ్మం జిల్లా పినపాక సిట్టింగ్ సీటు సీపీఐకి ఇవ్వడం బాధాకరమని, రేగ కాంతారావుకు ఇవ్వాల్సిందని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఇవాళ ఉదయం కేంద్రమంత్రి జైరాం రమేశ్, కొప్పుల రాజుతో సమావేశమైన అనంతరం రేణుకాచౌదరి మీడియాతో మాట్లాడారు. రేగ కాంతారావు వివాదరహితుడని రేణుక అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రేగ కాంతారావు రేపు (శనివారం) నామినేషన్ ను ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు.