: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
హైదరాబాదులోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...సామాజిక రుగ్మతలపై పూలే పోరాడారని అన్నారు. సామాన్యులను ప్రజా ప్రతినిధులను చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.