: పెండ్లిమర్రిలో తలలు పగిలాయి
సీమాంధ్రలోని సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగాయి. కడప జిల్లా పెండ్లిమర్రిలో రెండు వర్గాల మధ్య విభేదాలు కొట్లాటకు దారితీశాయి. దీంతో రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంట్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి కాస్త చల్లబడింది. వర్గపోరు అధికంగా ఉండే పెండ్లిమర్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు ఎవరు, ఎటువైపు నుంచి దాడికి తెగబడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. మహిళలు అడ్డుకుంటున్నా ఇరు వర్గీయులు దాడులకు తెగబడడం విశేషం.