: కాంగ్రెస్ ను హెచ్చరించిన సీపీఐ నారాయణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు పంపారు. రెబల్స్ ను కాంగ్రెస్ పార్టీ చేరదీస్తే ఊరుకోనని... పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రెబల్స్ వెంటనే పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. మల్ రెడ్డికి ఇచ్చింది షరతులతో కూడిన బీఫాం మాత్రమే అని... ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. ఏడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాలకు సీపీఐ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వెంటనే కుటుంబసమేతంగా సోనియాగాంధీని కలసిన కేసీఆర్... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే తిట్టడం ఆత్మవంచన చేసుకోవడమేనని విమర్శించారు.