: బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన 'తెహల్కా' ఎడిటర్
'తెహల్కా' పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్ పాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రెండు రోజుల కిందటే ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు. కొన్ని రోజుల కిందట గోవా బెంచ్ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ సంస్థలో పనిచేసే జూనియర్ మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో గతేడాది చివరిలో తేజ్ పాల్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గోవాలోని సదా సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.