: అక్కడి వారిని ఓటేయనివ్వని ‘తేనెటీగలు’
ఖమ్మం జిల్లాలో ఓటర్లపై తేనెటీగలు దాడి చేయడంతో అక్కడి పోలింగ్ ఆగిపోయింది. కూసుమంచి మండలంలో ఉన్న పెరికసింగారంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఒక్కసారిగా వారిపై తేనెటీగలు దాడి చేయడంతో పలువురు ఇబ్బంది పడ్డారు. దీంతో అక్కడి పోలింగ్ ను అధికారులు నిలిపివేశారు.