: చిట్టీల రాణి ఉడాయించిన వైనంబెట్టిదనిన...
చిట్టీల రాణి విజయరాణి పక్కా ప్లాన్ ప్రకారం డబ్బుతో ఉడాయించింది. ముందుగానే తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం చిట్టీల డబ్బులన్నీ జమచేసుకుంది. చిట్టీలు పాడుకున్న వారికి మే నెలలో మొత్తాన్ని ఇచ్చేస్తానని నమ్మబలికింది. ఈ లోపుగా తట్టాబుట్టా సర్దేసింది. హైదరాబాద్ లో తనకు ఉన్న రెండు ఇళ్లు, గుడివాడలో ఉన్న వారసత్వపు ఇంటిని అమ్మేసింది.
భారీ మొత్తాన్ని సమకూర్చుకున్న ఆమె రాత్రికి రాత్రే సరంజామా మొత్తం సర్దేసింది. బెంగళూరుకు మకాం మార్చింది. బెంగళూరుకు చేరుకున్న విజయరాణి నెల రోజుల్లోనే నాలుగు ఇళ్లకు మకాం మార్చింది. తన సమాచారం తెలియకుండా ఉండేందుకు రోజుకో సెల్ నెంబర్ మారుస్తూ పోలీసుల దృష్టి మరల్చింది. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడి విచారణ ఎదుర్కొంటోంది.