: వైఎస్సార్సీపీలో చేరిన లావు రత్తయ్య


విజ్ఞాన్ సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్ లోని నివాసంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీమాంధ్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం కావాలని, అందుకే వైఎస్సార్సీపీలో చేరినట్లు ఈ సందర్భంగా రత్తయ్య అన్నారు. అయితే, టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని చెప్పారు. పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం టీడీపీ వలసలతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News