: ఎన్నికలొస్తే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఓటమే: టైమ్స్ సర్వే
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. అదే జరిగితే మళ్లీ యూపీఏ అధికారంలోకి రాగలుగుతుందా? రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ సందేహాలు తీరాలంటే తాజాగా వెలువడిన టైమ్స్ సర్వే ఫలితాలు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఉన్నపళంగా లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తే యూపీఏ ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలింది.
రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బలం సగానికి సగం పడిపోతుందని టైమ్స్ సర్వే వెల్లడించింది. ఇక రాష్ర్టంలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ 19 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని, టీఆర్ఎస్ తెలంగాణలోని 13 లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంటుందని తెలిపింది. టీడీపీకి 5 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ కు 4 మాత్రమే వస్తాయని పేర్కొంది.