: తాడిపత్రి మండలంలో టీడీపీ, వైకాపా వర్గీయుల రాళ్లదాడి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఇరువర్గాలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.