: కేసీఆర్ సూచనతో నామినేషన్ ఉపసంహరించుకున్న భిక్షపతి
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భిక్షపతి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి భిక్షపతిని బుజ్జగించారు. దీంతో, ఆయన ఎన్నికల బరిలోనుంచి వైదొలగారు.