: మోడీని ఓడించడానికి ఒక్కటైన అమ్ ఆద్మీ, అన్సారీ!


ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఓడించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర అభ్యర్థుల సాయాన్ని కోరింది. ఇక్కడ మోడీకి ప్రత్యర్థులుగా ఆమ్ ఆద్మీ అభ్యర్థి కేజ్రీవాల్, ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థి మురళీమనోహర్ జోషికి అన్సారీ గట్టి పోటీనిచ్చారు. అయితే బలమైన అభ్యర్థిగా ఉన్న అన్సారీ తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఓట్లు చీలి పోకూడదనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నానని ఆయన చెప్పారు. దీనిపై ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ... అవినీతిని నిర్మూలించడానికి వీలుగా దేశం నుంచి కాంగ్రెస్, బీజేపీని పారదోలాలని, అందుకు అన్ని శక్తులు ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ హత్య కేసులో నిందితుడైన అన్సారీ ప్రస్తుతం ఆగ్రాజైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News