: చిన్న ఘర్షణల్లో మేము జోక్యం చేసుకోం: రమాకాంత్ రెడ్డి
చిన్న చిన్న ఘర్షణల్లో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలు తారుమారయ్యాయని చెప్పారు. పోలింగ్ నిలిచిపోయిన కేంద్రాలకు ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అందరూ సమైక్యంగా కృషి చేయడం వల్లే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని అన్నారు.