: ఓటు వేసే సమయంలో పార్టీ టోపీ ధరించిన 'ఆప్' నేతకు నోటీసు


బస్తర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సోని సోరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. పార్టీ గుర్తుతో ఉన్న టోపీ ధరించి ఆమె ఓటు వేశారని, ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లేనని ఈసీ తెలిపింది. ఈ క్రమంలో వివరణ కోరుతూ నోటీసు పంపినట్లు దంతెవాడ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ చెప్పారు. అప్పటికే దానిపై పలువురు తమకు ఫిర్యాదులు చేశారని, స్థానిక టీవీల్లో కూడా చూపించడంతో సుమోటోగా తీసుకుని చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News