: సీమాంధ్రలో అభ్యర్థుల కొరత అవాస్తవం: దిగ్విజయ్


సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు మొగ్గుచూపడంలేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఖండించారు. సీమాంధ్ర ప్రాంతంలో అభ్యర్థులకు కొరత ఉందనే విషయం అవాస్తవమని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నామని... ఈ నెల 14 లోపు సీమాంధ్రలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికితోడు, తెలంగాణలో సోనియా, రాహుల్ ల పర్యటన వివరాలను కూడా డిగ్గీరాజా ప్రకటించారు. ఈనెల 16న సోనియా, 17న రాహుల్ గాంధీలు తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News