: మోడీ ఫెస్టో కాదు... బీజేపీ మేనిఫెస్టో: జోషి
బీజేపీ మేనిఫెస్టోపై వస్తున్న విమర్శలకు, ఆ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన మురళీ మనోహర్ జోషి వివరణ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించి మోడీ కొన్ని సూచనలు చేసినప్పటికీ... అది మోడీ ఫెస్టో కాదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీజేపీ కాపీ చేసిందన్న రాహుల్ విమర్శలను తోసిపుచ్చుతూ... కాంగ్రెస్సే బీజేపీ ఐడియాలను కాపీ కొట్టిందన్నారు.