: మిజోరాం స్థానానికి ప్రారంభమైన పోలింగ్
మిజోరాంలోని ఏకైక లోక్ సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ కూడా జరుగుతోంది. ఎనిమిది పారా మిలటరీ దళాలను అదనంగా రంగంలోకి దింపారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. వాస్తవానికి ఈ నెల 9నే ఇక్కడ పోలింగ్ జరగాల్సి ఉండగా, పౌర, విద్యార్థి సంఘాలు 72 గంటలపాటు బంద్ కు పిలుపునివ్వడంతో ఈ రోజుకు వాయిదా వేశారు.