: సౌరవిద్యుత్ తో వ్యవసాయం చేస్తే రాయితీ : మంత్రి సారయ్య
సౌర విద్యుత్ తో వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని మంత్రి సారయ్య చెప్పారు. ఇందుకు రైతాంగం ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను 3నెలల్లో అధిగమిస్తామని ఆయన వరంగల్ లో వెల్లడించారు. వ్యవసాయంలో నవకల్పనలు ప్రవేశపెట్టడం ద్వారా రైతులు కొత్తపుంతలు తొక్కి మెరుగైన ప్రయోజనాలు పొందాలని మంత్రి సూచించారు.