: నేడు పరిషత్ ఎన్నికల తుది విడత పోలింగ్
హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధిలో పరిషత్ ఎన్నికల తుదివిడత పోలింగ్ ఈ రోజు జరగనుంది. మొత్తం 536 జడ్పీటీసీ, 7975 ఎంపీటీసీ పదవులకు జరగనున్న ఎన్నికలకు 25,758 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ పదవులకు 2469 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, ఎంపీటీసీ పదవులకు 25,621 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ విధులు నిర్వర్తించడానికి 1,31,366 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.