: మోడీ కోటీశ్వరుడే కానీ... కారు కూడా లేదట!
గుజరాత్ లోని వడోదర లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.51 కోట్లుగా ప్రకటించారు. అయితే, ఆయనకు సొంత వాహనం లేదు. బుధవారం నామినేషన్ పత్రాలతో పాటుగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం బ్యాంకుల్లో నగదు, ఫిక్స్ డ్ డిపాజిట్లను కలుపుకొని తన చరాస్తుల విలువ రూ. 51,57,582 అని మోడీ ప్రకటించారు. చేతిలో రూ. 29,700 నగదు ఉందని, రూ. 1.35 లక్షలు విలువ చేసే నాలుగు ఉంగరాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
మోడీ గత రెండేళ్లుగా ఎలాంటి ఆభరణాలను కొనుగోలు చేయలేదు. ఆయనకు గాంధీనగర్ లో సుమారు కోటి రూపాయల విలువ చేసే ఒక ఇల్లు వుంది. అంతకు మించి ఆయనకు మరే ఇతర ఆస్తి లేదా భూమి లేవట!