: అత్యాచారం చేస్తే... ఉరితీసి చంపేస్తారా?: ములాయం


అత్యాచారం చేస్తే ఉరితీస్తారా? అంటూ సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యలు చేసి తాజాగా వివాదంలో కూరుకుపోయారు. రేపిస్టులకు అనుకూలంగా ములాయం వ్యాఖ్యానించడంపై పలువురు మండిపడుతున్నారు. అత్యాచార కేసుల్లో విధిస్తున్న శిక్షలపై ములాయం మాట్లాడటం కొత్త వివాదానికి దారి తీసింది. తాను అధికారంలోకి వస్తే అత్యాచారం కేసులకు సంబంధించిన చట్టాలను మారుస్తానని ములాయం అన్నారు. అయితే, రేపిస్టులకు ములాయం బాసటగా నిలవడంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ములాయం వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News