: 100 మందితో రేపు కాంగ్రెస్ జాబితా: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే 100 మంది అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటిస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, 20, 30 స్థానాలకు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కావాలంటే వారికే ముందు అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రేపు ఢిల్లీలో స్క్రీనింగ్, ఎన్నికల కమిటీ భేటీలో జాబితా ఇస్తామని ఆయన అన్నారు. అనంతరం జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒకటి, రెండు లోక్ సభ స్థానాలు పక్కన పెడితే అందరూ ఖరారైనట్టేనని ఆయన స్పష్టం చేశారు.