: ప్రపంచంలో అత్యంత ఫాటెనింగ్ ఫుడ్ గా జిలేబీ!
జిలేబీ.. ఈ పేరు వింటే చాలు ఒక్కసారే నోరూరుతుంది. దేశ వ్యాప్తంగా అత్యధికులు ఇష్టపడే తీపి పదార్థాల్లో ఇదొకటి. భారతదేశంలోనే కాకుండా మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా దేశాల్లోనూ జిలేబీని బాగా ఇష్టపడతారు. తాజాగా అమెరికాకు చెందిన హఫ్పింగ్ టన్ పోస్ట్.కామ్ అనే వెబ్ సైట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వీట్లలో కొన్నింటిని తీసుకుని పది రకాలతో ఓ జాబితాను విడుదల చేసింది. అమితంగా ఇష్టపడే, అదే సమయంలో ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని ఈ జాబితాలో తీసుకుంది. అందులో జిలేబీని అత్యంత ఫాటెనింగ్ (ఉబకాయం, కొవ్వు) పదార్థంగా పేర్కొంది. అంతేకాక ఇటలీకి చెందిన కాల్జోన్, స్పెయిన్ నుంచి చర్రోస్ పదార్థాలను జాబితాలో ఉంచింది.