: ఐఫా అవార్డు వేడుకల్లో శతుఘ్నసిన్హాకు ప్రత్యేక సన్మానం


బాలీవుడ్ శతఘ్నిగా, తనదైన శైలి డైలాగ్ డెలివరీతో పేరుతెచ్చుకున్న సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హాను ఐఫా సన్మానించనుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు ఫ్లోరిడాలో జరుగనున్న ఐఫా అవార్డుల ప్రదాన కార్యక్రమంలో భారత చలనచిత్ర పరిశ్రమకు 45 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన శత్రుఘ్నసిన్హాను ఘనంగా సన్మానించేందుకు ఐఫా నిర్వాహక వర్గం నిర్ణయించింది. బీజేపీ నేతగా ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన శత్రుఘ్నసిన్హా రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర'లో చివరిగా కన్పించారు.

  • Loading...

More Telugu News