: చిలుకూరు బాలాజీ ఆలయంలో ఘనంగా ధ్వజారోహణం


గోవింద నామస్మరణతో చిలుకూరు బాలాజీ ఆలయం మార్మోగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో బుధవారం నాడు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న గరుత్మంతునికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గరుత్మంతుడి పటాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ తరువాత ధ్వజ స్తంభానికి పతాకావిష్కరణ చేశారు. ధ్వజస్తంభానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం కలుగని మహిళలకు పంచిపెట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇవాళ స్వామివారిని 35 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ పూజారులు తెలిపారు.

  • Loading...

More Telugu News