: భారతీయ జనతా పార్టీ బాబు జేబులో పార్టీగా మారిపోయింది: కవిత
నిజాం షుగర్స్ ను అమ్మేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవిత, ఇవాళ నిజామాబాదులో మీడియాతో మాట్లాడారు. హైదరాబాదు నగరంలో హైటెక్ సిటీని తానే కట్టించానని చెబుతున్న ఆయన, జిల్లాల్లో మాత్రం రైతుల పొట్ట కొట్టారని బాబుపై విమర్శలు కురిపించారు. భారతీయ జనతాపార్టీ కాస్తా ఇప్పుడు బాబు జేబులో పార్టీగా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పరాయి పాలకుల కిరాయి మనుషులుగా మారిపోయారని ఆమె ఆరోపించారు.