: ఓటు కోసం అవార్డు ఫంక్షన్లకు రానని చెప్పిన నటి


ఆవార్డు ఫంక్షన్లలో సినిమా తారలు సందడి చేయడం రివాజు. అది వారి కెరీర్ ఎదుగుదలకు సహకరిస్తుందని, తమ వారిని ప్రోత్సహించేందుకు మంచి అవకాశమని సినిమా తారలు భావిస్తారు. రొటీన్ జీవితం నుంచి స్వాంతన పొందడం కోసం, అవార్డు ఫంక్షన్లలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతారు. అందుకు భిన్నంగా సినీ నటి సోహా అలీఖాన్ అవార్డు ఫంక్షన్లకు హాజరు కాలేనని తెలిపింది.

ఈ నెల 24న మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓటేయాల్సి ఉన్నందున... ఈ వారాంతంలో జరిగే అంతర్జాతీయ భారతీయ ఫిలిం అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమానికి, ఫ్లోరిడాలోని టంపా బేలో ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే మరో కార్యక్రమానికి రాలేనని తెలిపింది. ఓటు వేయడం తన హక్కు అని, అవార్డుల ఫంక్షన్లు ఎప్పుడైనా జరుగుతాయని సోహాఅలీఖాన్ తెలిపారు. ఇతర నటీనటుల గురించి తాను చెప్పలేనని, తనకు అవార్డు ఫంక్షన్ల కంటే ఓటేయడమే ముఖ్యమని ఆమె స్పష్టం చేసింది. సోహా అలీఖాన్ ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఉన్నారు.

  • Loading...

More Telugu News