: 'మాకా హక్కుంది' సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం


రాష్ట్ర విభజనపై కౌంటర్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం అమలు చేసింది. సుప్రీంకోర్టు పంపిన నోటీసులకు సమాధానం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేశామని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రాన్నైనా రెండుగా విడదీసే అధికారం, రెండు రాష్ట్రాలను కలిపే అధికారం కేంద్రానికి వున్నాయని, ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్రపతికి కూడా అవే అధికారాలు ఉన్నాయని వివరించింది.

అందుకు ఉదాహరణగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కూడా కేంద్రం ఉటంకించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను పరిశీలించిన రిజిష్ట్రీ మే 5న దీనిపై విచారణ జరపాలని పేర్కొంటూ న్యాయమూర్తి దత్తు బెంచ్ కు సూచించారు.

  • Loading...

More Telugu News