: అమెరికాలో ప్రతీ వారం తల్లులవుతున్న 1700 మంది బాలికలు
అగ్రరాజ్యం అమెరికాలో బాల్యంలోనే శృంగారంలో పాల్గొంటూ, గర్భం దాలుస్తున్న బాలికల పరిస్థితి చూస్తుంటే విస్తుగొలిపేలా ఉంది. ప్రతీ వారంలో కనీసం 1700 మంది బాలికలు (15 నుంచి 17 ఏళ్ల వయసు) అక్కడ బిడ్డకు జన్మనిస్తున్నారట. అమెరికా ప్రభుత్వ విభాగమైన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, టీనేజర్లు గర్భవతులు కాకుండా చూడడంలో తాము ఫలితాలు సాధిస్తున్నట్లు సీడీసీ డైరెక్టర్ టామ్ ఫ్రీడెన్ తెలిపారు. 20 ఏళ్ల కిందటి నాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం తల్లులవుతున్న బాలికల సంఖ్య తగ్గడం సానుకూల పరిణామం. టీనేజర్లలో కేవలం 27 శాతం మందే శృంగారంలో పాల్గొంటున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఇలాంటి పనుల్లో పాల్గొంటున్న వారిలో 90 శాతం మంది గర్భం రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారట.