: చిరంజీవి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ


కేంద్ర మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి నివాసంలో (హైదరాబాదులో) ఆ పార్టీ ముఖ్య నేతలు రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతలు సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. కాగా, రేపు దిగ్విజయ్ సింగ్ తో ఏపీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News