: ఫేస్ బుక్ దొంగ ఫ్రెండ్


ఊరు, పేరూ తెలియకపోయినా, కనిపించిన వారినల్లా నమ్మి ఫ్రెండ్ షిప్ చేస్తే ఇలాంటి కష్టాలే వస్తాయ్ మరి. ఉత్తరప్రదేశ్ లోని డెహ్రాడూన్ కు చెందిన సునీతానేగికి ఫేస్ బుక్ లో జ్యోతి అనే ఆమె నుంచి ఫ్రెండ్ షిప్ అభ్యర్థన వచ్చింది. తాను ఢిల్లీలో ఉంటానని చెప్పింది. సునీతా ఓకే చెప్పేసింది. కొన్ని రోజులు మాట్లాడుకోవడం అయ్యాక ఒక రోజు జ్యోతి సంగీత ఇంటికి వెళ్లింది. బంధువులను కలవడానికి వచ్చినట్లు నమ్మించింది. అలా వారం రోజుల పాటు సంగీత ఇంట్లోనే మకాం వేసింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లి మళ్లీ మరో రోజు వచ్చింది. సంగీతకు చెందిన 50వేల రూపాయల విలువైన ఆభరణాలతో తుర్రుమంది. దీనిపై సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వివరాలు అడగ్గా తనకు జ్యోతి ఫేస్ బుక్ ఐడీ తప్ప ఆమె గురించి ఇతరత్రా ఎలాంటి వివరాలు తెలియవని చెప్పింది. జ్యోతి ఐడీ నకిలీదని విచారణలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News