: మరో రెండు రోజులు వానలు కురుస్తాయ్!


రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు క్యుములోనింబస్ మేఘాల వల్ల పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా ఉండటంతో... గత రెండ్రోజులుగా పలుచోట్ల వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వాన పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News