: అమ్మ, తమ్ముడికే పరిమితం... ఆశావహులకు ఝలకిచ్చిన ప్రియాంకా గాంధీ


కాంగ్రెస్ నేతలకు ప్రియాంకా గాంధీ ఝలకిచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఛరిష్మా పెద్దగా పనిచేయని నేపథ్యంలో ప్రియాంకా గాంధీతో ప్రచారం చేయించుకుని లబ్ది పొందొచ్చని ప్రణాళికలు రచించిన ఆ పార్టీ సీనియర్ నేతలకు... ప్రియాంకా గాంధీ సుతిమెత్తగా తాను ప్రచారం చేయనని చెప్పేశారు. ఢిల్లీలో తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, తన తల్లి సోనియా గాంధీ, తమ్ముడు రాహుల్ గాంధీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు. ఇతర నాయకుల తరపున ప్రచారం చేసేందుకు అమ్మ, తమ్ముడు ఉన్నారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News