: ఈ ఏటీఎంలు డబ్బుల కోసం కాదు... గుక్కెడు నీళ్ల కోసం


జేబులు ఖాళీ అయితే ఏటీఎం సెంటర్ కు వెళ్లడం అలవాటే. కానీ, దాహమేస్తే కూడా తీర్చుకోవడానికి ఏటీఎంలకు వెళ్లవచ్చు. కాకపోతే ఇవి వాటర్ ఏటీఎంలు అన్నమాట. ఉత్తరప్రదేశ్ లోని పలు గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో హెచ్ డీఎఫ్ సీ ఎర్గో ఆరోగ్య బీమా కంపెనీ ఈ వాటర్ ఏటీఎంలను ప్రవేశపెట్టింది. కేవలం 30 పైసలకే ఒక లీటరు స్వచ్ఛమైన నీటిని వీటి ద్వారా పొందవచ్చు. స్వచ్చంద సంస్థ సర్వజల్ తో కలసి హెచ్ డీఎఫ్ సీ ఈ ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు సంస్థలు ఇంతకుముదే వీటిని ప్రయోగాత్మకంగా రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి.

  • Loading...

More Telugu News