: పోలింగ్ పై బ్రిటన్ రాయబారి ఆసక్తి
మహారాష్ట్రలో మావోయిస్టు ప్రభావిత విదర్భ ప్రాంతంలో పోలింగ్ ను పరిశీలించేందుకు బ్రిటన్ రాయబారి సర్ జేమ్స్ డేవిడ్ బెవాన్ నాగ్ పూర్ చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న పోలింగ్ ను పరిశీలించడం అద్భుతమైన అనుభవంగా చెప్పారు. నాగ్ పూర్ చేరుకున్న వెంటనే డేవిడ్ బెవాన్ నేరుగా బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నివాసానికి వెళ్లారు. అక్కడ అర్ధగంటపాటు ఉన్నారు.