: సీమాంధ్రలో టీడీపీ తరపున పారిశ్రామిక వేత్తల ప్రచారం


టీడీపీ అధినేత చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించిన వారు.. సీమాంధ్రలో టీడీపీ తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అనంతరం మీడియాకు తెలిపారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని, బాబుకే ఆ సామర్థ్యం ఉందన్నారు. భవిష్యత్తులో సీమాంధ్రలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. బస్సు యాత్ర ద్వారా 40 మంది పారశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు ఈ ప్రచారంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News