: గూగుల్ తల్లికి అంతా తెలుసు


గూగుల్ తల్లికి అంతా తెలుసు అని ఓ సినిమాలో అన్నట్టు...గూగుల్ లో అన్నింటికీ సమాచారముంది. తాజాగా భారత దేశంలో ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఓటర్లకు తెలియవు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న గూగుల్ సంస్థ 'నో యువర్ కేండిడేట్స్' అనే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో దేశంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.

ఎన్నికల నేపథ్యంలో వారు వెల్లడించిన వాస్తవ అంశాలు కూడా అందులో పొందుపరచనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో పొటీ చేసే అభ్యర్థులు స్వయంగా వెల్లడించే వివరాలు అందులో అందుబాటులో ఉండనున్నాయి. దీంతో ఓటు వేసేముందు ఓటర్లే స్వయంగా అభ్యర్థుల గురించి తెలుసుకుని ఓటు వేసే వెసులుబాటు ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News