: నేలరాలిన మామిడికాయలు... తెగిపడిన అరటి గెలలు


చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో జిల్లాలో పంటనష్టం జరిగింది. ఈ అకాల వర్షం రైతులకు ఆవేదనను మిగిల్చింది. పలుచోట్ల చెట్లు కూలిపోగా, విద్యుత్ వైర్లు తెగి కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో తిరుపతి శివారు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో మొదలైన వాన రెండు గంటల పాటు కుండపోతగా కురిసింది. వర్షపు ధాటికి పంటకొచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి, అరటి గెలలు తెగిపడ్డాయి.

  • Loading...

More Telugu News