: మోడీ పెళ్లిపై ఆయన సోదరుడు ఏమంటున్నారు?
నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి గురించి మోడీ వివరాలు వెల్లడించడంతో దానిపై చర్చలు మొదలయ్యాయి. దీనిపై మోడీ సోదరుడు దామోదర్ దాస్ మోడీ మాట్లాడుతూ... తన సోదరుడు నరేంద్రమోడీ 45 ఏళ్ల కిందట మైనర్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. అప్పుడు తమ కుటుంబం చాలా పేద స్థితిలో ఉందని, చదువుకున్న వారు కూడా లేరని చెప్పారు. మోడీ దేశసేవ కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశారని వివరించారు.