: ఆమ్ ఆద్మీ హైదరాబాదు ఎంపీ అభ్యర్థిగా లుబ్నా సర్వత్
హైదరాబాదు పార్లమెంటు స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) తరపున డాక్టర్ లుబ్నా సర్వత్ (49) బరిలోకి దిగుతున్నారు. హైదరాబాదు లోక్ సభ స్థానానికి బుధవారం నాడు లుబ్నా ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశారు. మెహిదీపట్నం గుడిమల్కాపూర్ కు చెందిన లుబ్నా ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ఇండోనేషియా, జకార్తాలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆమె ఎకనామిక్స్ విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటయిన ఆమ్ ఆద్మీ పార్టీలో లుబ్నా సభ్యురాలిగా చేరి, ఆ పార్టీ తరపున హైదరాబాదు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.