: మల్కన్ గిరి జిల్లా పోలింగ్ కేంద్రాలపై మావోయిస్టుల దాడి
మూడో దశ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఒడిశాలో పది లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా మత్తిలి సమీపంలో పోలింగ్ కేంద్రాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. మహూపొదర్ పోలింగ్ కేంద్రంలో ట్రక్కుకు నిప్పుపెట్టి నాలుగు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. దాంతో, చిత్రకొండ నియోజకవర్గం మహుపొదర్ లోని నాలుగు కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది.