: అమెరికాలో 22మందిపై కత్తులతో దాడి చేసిన స్కూల్ విద్యార్థి


అమెరికాలో మరో విద్యార్థి ఉన్మాద రూపం దాల్చాడు. పిట్స్ బర్గ్ లో తాను చదువుతున్న స్కూల్లోనే సహచర విద్యార్థులపై నిన్న రెండు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతడి చేతిలో మొత్తం 22 మంది కత్తిపోట్లకు గురయ్యారు. ఫ్రాంక్లిన్ రీజినల్ హైస్కూల్లో ఇది జరిగింది. దాడి తర్వాత నిందితుడు అలెక్స్ హ్రిబాల్(16)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడిలో పలువురికి తీవ్రంగా గాయాలవగా వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

  • Loading...

More Telugu News