: వైఎస్సార్సీపీలో చేరిన సినీ నటి పూర్ణిమ


'ముద్దమందారం', 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తదితర చిత్రాల్లో నటించిన నటి పూర్ణిమ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం పూర్ణిమ మాట్లాడుతూ... వైఎస్ జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని, రాష్ట్రాభివృద్ధి జగన్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు. పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని పూర్ణిమ అన్నారు.

  • Loading...

More Telugu News