: ‘నమో’ అంటే అర్థం అది కాదట!


సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్న మాట ‘నమో’. అంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు ఆ పదానికి అర్థం అది కాదని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తులపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి మాత్రం పొత్తులు ఖాయమని మొదటి నుంచి ధీమాగానే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి ‘సైకిలెక్కిన’ నేతలను వీరిద్దరూ దగ్గరుండి నడిపించారనే చెప్పాలి. అలాగే బీజేపీతో పొత్తుల విషయంలో కూడా వీరిద్దరూ చొరవ చూపినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదరటంతో చంద్రబాబు, నరేంద్రమోడీ చేతులు కలిపితే విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఉన్నారు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు. కడపలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రజాగర్జనలో సీఎం రమేశ్ మాట్లాడుతూ ‘నమో’కు కొత్త నిర్వచనం చెప్పారు. ‘న’ అంటే నాయుడు...‘మో’ అంటే మోడీ అంటూ ఆయన సెలవిచ్చారు. నాయుడు-మోడీ జోడీ సూపర్ హిట్ అని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News