: కేసీఆర్ పై పోటీగా రెబల్ అభ్యర్థి నామినేషన్


మెదక్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఈ ఎన్నికల్లో ఇంటి పోరు తప్పేలా లేదు. ఆయనపై పోటీగా అదే పార్టీకి చెందిన జిల్లా నాయకుడు బీరప్ప యాదవ్ మెదక్ ఎంపీ స్థానానికి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ సంగారెడ్డిలో హెలికాప్టర్ దిగగానే హెలి ప్యాడ్ వద్దకెళ్లి స్వాగతం పలికిన ఆయన, అనంతరం టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ టికెట్టు ఇవ్వలేదన్న అసంతృప్తితో బీరయ్య యాదవ్ రెబల్ గా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News