: శ్రీలంక క్రికెటర్లకు స్వదేశంలో నీరాజనం
ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక క్రికెటర్లకు ఘనస్వాగతం లభించింది. స్వదేశంలో అభిమానులు నీరాజనం పలికారు. బంగ్లాదేశ్ నుంచి స్వదేశం చేరిన శ్రీలంక క్రికెటర్లను అభినందించేందుకు భారీఎత్తున అభిమానులు కొలంబో విమానాశ్రయానికి తరలివచ్చారు. అక్కడి నుంచి అధ్యక్షభవనం వరకు దారికి ఇరువైపులా ఉండి తమ అభిమాన క్రికెటర్లకు జేజేలు పలికారు. ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుపై నుంచి అభిమానులను పలకరిస్తూ శ్రీలంక క్రికెటర్లు అధ్యక్ష భవనానికి వెళ్లారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లను అభినందించి వారి చేత కేక్ కట్ చేయించారు.