: అకాల వర్షంతో మామిడి, జీడి పంటలకు తీవ్ర నష్టం
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురవడంతో మామిడి, జీడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని పలు ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల వరకు మామిడి, జీడి తోటలున్నాయి. కోతకొచ్చిన మామిడి నేలరాలడంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాలిన పంటపై ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరుతున్నారు.