: సీమాంధ్రలో 12 నుంచి 19 వరకు నామినేషన్లు
సీమాంధ్రలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 12 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాదులో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ భన్వర్ లాల్ మాట్లాడుతూ, ఈ నెల 12 నుంచి 19వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు సీమాంధ్రలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే రోజున నామినేషన్లు స్వీకరించమని ఆయన స్పష్టం చేశారు.