: ఎన్డీయేలోకి కొత్త పార్టీలొస్తున్నాయ్


కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు కుదించుకుపోతుండగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు అంతకంతకు బలపడుతున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిది ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 28 పార్టీలు కొత్తగా ఎన్డీయేలో చేరాయని వెల్లడించారు. ప్రజల్లో ఊపును చూస్తుంటే, 350 కి పైగా సీట్లు సాధించి కేంద్రంలో ఎన్డీయే సుస్థిర, శక్తిమంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. "బీజేపీ అధికారంలోకి రాకుండా, మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వామ్య పక్షాల కనీస ఉమ్మడి కార్యక్రమం, ఉమ్మడి ఎజెండా. దాని కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతున్నారు" అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో గొప్ప పేరున్న నేతలు కూడా, జాతికి అబద్ధాలు చెబుతున్నారని, భ్రమలు రేపి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘లౌకికవాదం వర్సెస్ మతతత్వం’ అంటూ ముందుకు తెస్తున్న ఫార్ములాను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు.

  • Loading...

More Telugu News